దీపావళి వ్యాపారం రూ.72 వేల కోట్లు.. చైనా వస్తువులు..

దీపావళి వ్యాపారం రూ.72 వేల కోట్లు.. చైనా వస్తువులు..
నివేదికలో సుమారు రూ.72వేల కోట్ల ఖరీదు చేసే అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది.

కరోనాతో ఇబ్బంది పడుతున్నాం.. క్రాకర్స్ కాల్చొద్దని సర్కారు ఆర్డర్స్ పాస్ చేసినా అప్పటికే ఖరీదు చేసిన దీపావళి టపాసులను కాల్చి పండుగను జరుపుకున్నారు దేశ ప్రజలు. పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని వ్యాపారం పుంజుకుందని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్ (సీఏఐటీ) తెలిపింది. ఆ నివేదికలో సుమారు రూ.72వేల కోట్ల ఖరీదు చేసే అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. అయితే ఈసారి చైనా ఉత్పత్తులకు భారీ నష్టం జరిగిందని సంస్థ వెల్లడించింది.

భారతీయ వ్యాపారులు చైనా ఉత్పత్తులపై నిషేధం విధించడం వల్ల సుమారు రూ.40వేల కోట్ల వ్యాపారం జరగలేదని పేర్కొంది. ఈస్టన్ లడాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా వస్తువులపై సీఏఐటీ నిషేధం విధించింది. దేశంలోని 20 ప్రధాన నగరాల్లో సుమారు 72 వేల కోట్ల రూపాయల దీపావళి ఉత్పత్తుల వ్యాపారం జరిగినట్లు సీఏఐటీ తెలిపింది.

కాగా, పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఇతర ఉత్పత్తులు.. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, కిచెన్ ఆర్టికల్స్ , జ్యువెలరీ, ఫర్నీచర్, గార్మెంట్స్ వ్యాపారం కూడా బాగానే సాగింది. దీనిని బట్టి భవిష్యత్ మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, నాగపూర్, రాయ్‌పూర్, భువనేశ్వర్, రాంచీ, భోపాల్, లక్నో, కాన్పూర్, నోయిడా, జమ్ము, అహ్మదాబాద్, సూరత్, కొచ్చిన్, జైపూర్, చండీఘడ్ నగరాల్లో జరిగిన వ్యాపారంపై సీఏఐటీ తన నివేదికను తయారు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story