40 ఏళ్లు దాటిన వారు వారానికి ఎన్ని గంటలు పని చేయాలంటే..

40 ఏళ్లు దాటిన వారు వారానికి ఎన్ని గంటలు పని చేయాలంటే..
రాత్రింబవళ్లు పని చేయాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి అధికమవుతోంది. తమ కోసం తాము సమయాన్ని

40 ఏళ్లు దాటినా ఉద్యోగం చేస్తూ ఉరుకుల పరుగులు పెడుతున్నారా.. కొన్ని సందర్భాల్లో తప్పకపోయినా వారానికి 25 గంటలకంటే ఎక్కువ పని చేస్తే మెదడు పనితీరు‌పై ఒత్తిడి పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లిళ్లు లేటవుతున్నాయి.. పిల్లలు లేటుగా పుడుతున్నారు.. వారి బాధ్యతలు నెరవేర్చడం కోసం రాత్రింబవళ్లు పని చేయాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి అధికమవుతోంది. తమ కోసం తాము సమయాన్ని కేటాయించుకోకుండా మీటింగులు, టార్గెట్లు అంటూ రోజంతా హడావిడిగా గడిపితే ఆరోగ్యానికి ప్రమాదమని పరిశోధనలు వివరిస్తున్నాయి.

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్ పరిశోధకులు 40 ఏళ్లు పైబడిన 6,000 మందికి పైగా ఉద్యోగులపై ఒక అధ్యయనం నిర్వహించారు. 40 ఏళ్ల వయసులో మెదడు సామర్ధ్యం క్షీణించడం ప్రారంభించినప్పటికీ వ్యాయామం చేసే అలవాటు ఉన్న వారి మెదడు పని తీరు మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. స్త్రీలు వారానికి 25-30 గంటలు అదే పురుషులు అయితే వారానికి 22-27 గంటలు పని చేయాలని నిర్ణయించారు. అదనంగా పని చేస్తే శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతారని తెలిపారు.

ఈ చర్యను అధిగమించాలంటే తగినంత నిద్ర అవసరం. అలసటకు గురైన శరీరం నిద్ర ద్వారా విశ్రాంతి పొందుతుంది. 26 ఏళ్లు పైబడిన వారికి రాత్రి ఏడు గంటలకు మించి నిద్ర పోవాలని పరిశోధనల్లో సిఫార్సు చేయబడింది. వయసు 40 దాటిందని ఆందోళన చెందకుండా మంచి ఆహారం తీసుకుంటూ, తగినంత వ్యాయామం, నిద్ర అలవరచుకుంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story