బ్రేకింగ్.. రైల్వేక్రషర్ సైట్‌లో భారీ పేలుడు.. 8 మంది మృతి

బ్రేకింగ్.. రైల్వేక్రషర్ సైట్‌లో భారీ పేలుడు.. 8 మంది మృతి
భారీ పేలుడు ధాటికి మృతులు ఎవరో కూడా గుర్తు పట్టలేనంతగా శరీరభాగాలు తునాతునకలైపోయాయి.

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. హునసోడులోని రైల్వే క్రషర్‌ సైట్‌లో రాత్రి డైనమైట్‌లు పేలి 8 మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. భారీ పేలుడు ధాటికి మృతులు ఎవరో కూడా గుర్తు పట్టలేనంతగా శరీరభాగాలు తునాతునకలైపోయాయి. రాత్రి 10.30 సమయంలో పేలుడు కావడంతో సహాయ చర్యలకు ఆకంటం ఏర్పడింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు. స్వయంగా పరిస్థితి సమీక్షించారు. రెస్క్యూటీమ్‌తోపాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు.

బ్లాస్టింగ్‌‌కి ఉపయోగించే డైనమైట్లు వంటి వాటిని తీసుకెళ్తున్న లారీలో పేలుడు సంభవించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా.. లేదంటే మైనింగ్ సమయంలో ప్రమాదం జరిగిందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఐతే.. ఈ పేలుడు తీవ్రతకు సమీపప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. రోడ్డు కూడా బీటలు వారింది. ఈ భారీ శబ్దాన్ని విని ఇది భూకంపం అని జనం కంగారుపడి ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ పేలుడు తీవ్రతకు శివమొగ్గ జిల్లా శివార్లలో పేలుడుతో సమీపంలోని చిక్‌మంగళూరు, దావణగెరె జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.


Tags

Read MoreRead Less
Next Story