EC :కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కీలక తీర్పు

EC :కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కీలక తీర్పు
ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తప్పు పట్టింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయిదుగురు సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేంత వరకు.. ఈ కమిటీ అమలులో ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ధర్మాసనం తరఫున జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ చదివారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించేందుకు ఎలాంటి పద్ధతి అమల్లో ఉందో... అలాంటి పద్ధతినే ఎన్నికల కమిషనర్లను తొలగించేందుకు అనుసరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story