Top

ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు

ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ డిప్యూటీ జనరల్ మేయర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్

ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు
X

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ డిప్యూటీ జనరల్ మేయర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేస్తోంది.

మొత్తం ఖాళీలు 15

సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 4, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్)- 2, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ పర్చేజ్)- 1, సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్)- 2, సీనియర్ మేనేజర్ (లా)- 1, పర్సనల్ ఆఫీసర్- 1, అకౌంట్స్ ఆఫీసర్- 1 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: పోస్టులను బట్టి విద్యార్హతలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ..

డిసెంబర్ 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్ధులు రేపు సాయింత్రం 4 గంటల్లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి ఫ్రింట్ తీసుకొని నోటిఫికేషన్‌లో తెలిపిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి. నార్మల్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, కొరియర్ ద్వారా అప్లికేషన్ ఫామ్ పంపాలి.

ఆఫ్‌లైన్ దరఖాస్తుల్ని పోస్టులో 2021 జనవరి 11 సాయింత్రం 4 గంటల్లోగా పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: Additional General Manager & In-Charge, HR Personnel Group, Admiistrative Office, Electronics Corporation of India Limited, ECIL (Post), Hyderabad-500 062, Telangana.

Next Story

RELATED STORIES