ఆస్తమాని అలక్ష్యం చేస్తే కరోనా.. ఓ కప్పు కాఫీతో..

ఆస్తమాని అలక్ష్యం చేస్తే కరోనా.. ఓ కప్పు కాఫీతో..
ఉబ్బసం దాడిని నియంత్రించకపోతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది

ఉబ్బసం, ఆస్తమా పేర్లేవైనా ఊపరితీసుకోవడంలో పలు ఇబ్బందులు ఎదుర్కుంటారు ఈ వ్యాధితో బాధపడుతున్నవారు.. ఇక ఆస్తమా ఉన్నవారినైతే కరోనా కూడా త్వరగా అటాక్ చేస్తుంది.

ఆస్తమా రోగుల శ్వాస నాళాలు ఇరుకుగా ఉండి శ్లేష్మంతో నిండి ఉంటాయి, వాయు ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీనివల్ల శ్వాస సమస్యలు, దగ్గు, ఊపిరి ఆగినట్లు అనిపించడం జరుగుతుంటుంది. ఉబ్బసం దాడిని నియంత్రించబడకపోతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది. డాక్టర్ వసంత లాడ్ రాసిన 'ది కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేద హోమ్ రెమెడీస్' ప్రకారం, అన్ని ఉబ్బసం పరిస్థితులకు మూలకారణం కడుపులో కఫ దోషం పెరగడం. పెరిగిన కఫం గాలి యొక్క సహజ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కొన్ని ఇంటి చిట్కాలతో ఉబ్బసం వ్యాధి మరీ తీవ్ర రూపం దాల్చకుండా చూసుకోవచ్చని వివరించారు. అవి..

వేడి నీటిలో ఆరు చుక్కల లావెండర్ ఆయిల్ ను కలపాలి. దీన్ని పది నిమిషాల పాటు ఆవిరి పట్టడం ద్వారా శ్వాస నాళాలకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజుకు ఒకసారి చేస్తే ఫలితం ఉంటుంది. ఇక లావెండర్ ఆయిల్ రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.

ఓ గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. దీంతో పాటు రాత్రి పడుకునే ముందు తేనె, దాల్చినచెక్క కలిపిన నీటిని తీసుకోవాలి. ఇది గొంతులోని కఫాన్ని తగ్గిస్తుంది. ఆయాసంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నవారికి ఉపశమనంగా ఉంటుంది.

ఓ గ్లాస్ నీటిలో పావు స్పూన్ పసుపు వేసుకుని రోజుకు మూడు సార్లు తాగాలి. పసుపు అద్భుతమైన యాంటీ మైక్రోబయల్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

ఉబ్బసం నుంచి తక్షణ నివారణ పొందడానికి వేడి కాపీ బాగా పనిచేస్తుంది. ఇది అత్యంత సులభమైన మార్గం. ఇది వెంటనే వాయు మార్గాలను క్లియర్ చేస్తుంది. శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. కాఫీలోని కెఫిన్ బ్రోంకోడైలేటర్‌గా పని చేస్తుంది.

ప్రతిరోజు ఈ విటమిన్ సప్లిమెంట్ తీసుకోవాలి. ఒక నెల రోజుల పాటు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. విటమిన్ డి కూడా ఆస్తమా లక్షణాలను తగ్గించడానిక సహాయపడుతుంది.

ఒక కప్పు వేడి నీటిలో టీస్పూన్ అల్లం తురుము వేసి బాగా కలపాలి. దీన్ని ఓ అయిదు నిమిషాల పాటు వేడి చేయాలి.. తర్వాత ఆ నీటిని వడకట్టి తేనె కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

అల్లం టీని రోజుకు మూడు కప్పులు తాగితే మంచిది. శ్వాస కోశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అల్లం బాగా పని చేస్తుంది. అల్లం వాయు మార్గ కండరాలను సడలించి, కాల్షియం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. దీనివల్ల ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది.

కప్పు పాలు, కప్పు నీళ్లు తీసుకుని అందులో 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసి అందులో కలిపి ఉడకబెట్టాలి. ఇవి ఒక కప్పు అయ్యే వరకు వేడి చేయాలి. ఈ పాలను రోజుకు ఒకసారి తాగాలి. వెల్లుల్లి ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. ఉబ్బసం లక్షణాలనుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story