ఎగ్, పన్నీర్ ఎందులో ప్రొటీన్ ఎక్కువ.. ఏది తీసుకుంటే మంచిది..

ఎగ్, పన్నీర్ ఎందులో ప్రొటీన్ ఎక్కువ.. ఏది తీసుకుంటే మంచిది..
శాఖాహారులకు పన్నీర్ ప్రొటీన్‌ని ఇచ్చే ప్రధాన వనరు. మాంసాహారులు దేన్నైనా ఎంచుకునే అవకాశం ఉంది.

శాఖాహారులు ఎగ్ తినకపోయినా కనీసం వారానికి రెండు మూడు సార్లు పనీర్ తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రొటీన్ అందుతుంది. గుడ్లు, పన్నీర్ రెండూ కాల్షియం, బి 12, ఐరన్ వంటి ఇతర ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉంటాయి. బరువు తగ్గేందుకు, శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, ఎముకలు, కండరాలు ధృఢంగా తయారయ్యేందుకు ప్రొటీన్ అవసరమవుతుంది. శాఖాహారులకు పన్నీర్ ప్రొటీన్‌ని ఇచ్చే ప్రధాన వనరు. మాంసాహారులు దేన్నైనా ఎంచుకునే అవకాశం ఉంది.

ఉడికించిన గుడ్డు 44 గ్రాముల బరువు వుంటుంది. ఇందులో ప్రొటీన్ 5.5 గ్రాములు ఉంటే కొవ్వు 4.2 గ్రాములు, కాల్షియం 24.6 మి. గ్రా, ఐరన్ 0.8 మి. గ్రా, మెగ్నీషియం 5.3 మి.గ్రా ఉంటాయి.

ఇక పన్నీర్ పాలతో తయారు చేసిన పదార్ధం. దీన్ని వంటల్లో వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. ఎగ్ తినని వారు పన్నీర్ ముక్కలను కొద్దిగా నూనెలో వేగించి ఉప్పు, మిరియాల పొడి చల్లి సాయింత్రం పూట స్నాక్స్‌లాగా తీసుకోవచ్చు.

ఒక కప్పు పన్నీర్‌లో 40 గ్రాముల కంటే తక్కువ కొవ్వు వుంటుంది. ఇందులో ప్రొటీన్ 7.54 గ్రాములు ఉంటే, కొవ్వు 5.88 గ్రాములు, పిండి పదార్థాలు 4.96 గ్రాములు, ఫోలెట్ 37.32 మైక్రోగ్రామ్, కాల్షియం 190.4 మి.గ్రా ఉంటాయి.

గుడ్లు, పన్నీర్ రెండూ పోషకాలను సరిసమానంగా అందిస్తాయి. ఈ రెండూ ప్రోటీన్‌తో పాటు విటమిన్ బి 12, ఐరన్, కాల్షియం మరియు వివిధ రకాల విటమిన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో ఇవి నిండి ఉన్నాయి, ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. రెండు ఆహార పదార్థాలు కండరాలను నిర్మించడంలో మరియు బరువు తగ్గించే లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. అందువల్ల ఏదో ఒకటే మంచిదని చెప్పడం అసాధ్యం. అధిక ప్రయోజనాలను పొందేందుకు ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story