ఆరోగ్యకరమైన ఆహారం కోసం 8 చిట్కాలు

ఆరోగ్యకరమైన ఆహారం కోసం 8 చిట్కాలు
మీ శరీర అవసరాలకు మించి తినడం లేదా త్రాగడం చేస్తే బరువు పెరుగుతారు. అధిక కేలరీలు కొవ్వుగా నిల్వ చేయబడుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం మీరు చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. మీరు చేసే పనిపై మీరు తీసుకునే ఆహారం ఆధారపడి ఉంటుంది. మానసిక శ్రమ కంటే శారీరక శ్రమకు ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

మీ శరీర అవసరాలకు మించి తినడం లేదా త్రాగడం చేస్తే బరువు పెరుగుతారు. మీరు తీసుకునే అధిక కేలరీలు కొవ్వుగా నిల్వ చేయబడుతుంది.

శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందేలా చూసుకోవాలి. పురుషులకు రోజుకు 2,500 కేలరీలు, మహిళలకు రోజుకు సుమారు 2,000 కేలరీలు అవసరమవుతాయని ఆహార నిపుణులు సూచించారు.

1.మీరు తినే ఆహారంలో మూడింట ఒక వంతు మాత్రమే కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) ఉండాలి. ఇవి అధికంగా కలిగిన ఆహారపదార్థాలు బంగాళాదుంపలు, రొట్టె, బియ్యం, పాస్తా, తృణధాన్యాలు. పగలు చేసే భోజనంతలో కనీసం పై వాటిలో ఒక పదార్ధం ఉండేలా చూసుకోండి. కొంతమంది పిండి పదార్ధాలు కొవ్వుగా భావిస్తారు, కాని తక్కువ మోతాదులో తీసుకున్న కార్బోహైడ్రేట్ సగం కంటే తక్కువ కేలరీలను అందిస్తుంది.

2. ప్రతిరోజూ ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అల్పాహారంలో అరటిపండును ఎంచుకోవచ్చు. ఏదైనా పండును జ్యూస్ రూపంలో తీసుకుంటే అది 1 గ్లాస్ ఉండేలా చూసుకోవాలి.

3. చేపలు ఎక్కువగా తినండి చేప ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను అధికంగా కలిగి ఉంటుంది. వారానికి కనీసం 2 సార్లు చేపలను తినాలని లక్ష్యంగా పెట్టుకోండి.చేపలలో ఉండే ఒమేగా -3 కొవ్వులు గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి.

4. కొవ్వు పదార్థాలు, చక్కెర పదార్థాలను తగ్గించాలి. నెయ్యి, మాంసాహార వంటల్లో అధిక మొత్తంలో కొవ్వు వుంటుంది. కావునా వీటిని తక్కువగా తీసుకోవాలి.

కూల్ డ్రింక్స్ లో అధికంగా చక్కెర నిల్వలు ఉంటాయి. ఇవి ఊబకాయానికి, దంత సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, పానీయాలలో అధిక మొత్తంలో చక్కెరలు ఉంటాయి.

5. తక్కువ ఉప్పు తినండి: పెద్దలకు రోజుకు 6 గ్రాములకు మించకూడదు ఎక్కువ ఉప్పు తినడం వల్ల మీ రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె వ్యాధులకు దారితీస్తుంది.

6. చురుకుగా ఉండండి. ఆరోగ్యంకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక బరువు టైప్ 2 డయాబెటిస్, కొన్ని క్యాన్సర్లు, గుండె జబ్బులు వంటి ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. తక్కువ బరువు ఉండటం మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది.

7. నీరు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు ప్రతిరోజూ 6 నుండి 8 గ్లాసులు నీళ్లు తాగాలని ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. వేడి వాతావరణంలో లేదా వ్యాయామం చేసేటప్పుడు 8 గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగాలి.

8. అల్పాహారం మానవద్దు. కొంతమంది అల్పాహారం తినడం తగ్గిస్తే బరువు తగ్గుతామని భావిస్తారు. కానీ ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం సమతుల్య ఆహారంలో భాగం అవుతుంది. మంచి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను పొందడానికి సహాయపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story