ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత
దాదాపు 40 చిత్రాలకు పైగా విజయ్ దర్శకత్వం వహించారు.

ఈ ఏడాది చిత్ర పరిశ్రమకు చెప్పిన చెందిన ఎందరో ప్రముఖులు కన్నుమూశారు. మహమ్మారి కరోనా కారణంగా మరణించిన వారు కొందరైతే, అనారోగ్యంతో మృతి చెందిన వారు, ఆత్మహత్యలకు పాల్పడిన వారు మరి కొందరు. తాజాగా కన్నడ చిత్ర సీమకు చెందిన రాజ్‌కుమార్, విష్ణు వర్ధన్ వంటి అగ్రహీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు విజయ్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.



కన్నడలో దాదాపు 40 చిత్రాలకు పైగా విజయ్ దర్శకత్వం వహించారు. అందులో గంధద గుడి, మయూర, శ్రీనివాస కళ్యాణ, భక్త ప్రహ్లాద, సనాది అప్పణ్ణ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. రాజ్ కుమార్, విష్ణు వర్ధన్‌లతో కలిసి తెరకెక్కించిన గంధద గుడి చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా అడవి రాముడు పేరుతో కే. రాఘవేంద్రరావు తెలుగులో రీమేక్ చేశారు. అటు కన్నడలో ఇటు తెలుగులోనూ ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. విజయ్ కన్నడలో తెరకెక్కించిన మరి కొన్ని చిత్రాలను తెలుగులో కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోలు తెలుగు రీమేక్‌లో నటించారు. విజయ్ మృతికి కన్నడ చిత్ర పరిశ్రమ నివాళి అర్ఫించింది.

Tags

Read MoreRead Less
Next Story