Farmers In Delhi : ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్న రైతు సంఘాలు.. భవిష్యత్‌ కార్యాచరణ పై ప్రకటన

Farmers In Delhi :  ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్న రైతు సంఘాలు.. భవిష్యత్‌ కార్యాచరణ పై ప్రకటన
Farmers In Delhi : వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్న వేళ...ఇవాళ సమావేశం కానున్నాయి రైతు సంఘాలు. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నాయి.

Farmers In Delhi : వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్న వేళ...ఇవాళ సమావేశం కానున్నాయి రైతు సంఘాలు. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నాయి.సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. రైతు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధర అంశంపైనా తేల్చాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

మిగితా సమస్యల కోసం చర్చించేందుకు కేంద్రం ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పంపాలని కోరుతున్నారు రైతులు. ఆందోళనలు ఇప్పుడే విరమించేది లేదని ప్రకటించారు భారతయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేష్ తికాయత్. పార్లమెంట్‌లో మూడు అగ్రి చట్టాల రద్దు పూర్తయి ప్రకటన వచ్చాకే ఆందోళనలు విరమిస్తామన్నారు. మద్దతు ధర సహా ఇతర రైతు సమస్యలపైనా కేంద్రం స్పందించాలన్నారు.

నల్ల చట్టాల రద్దును స్వాగతిస్తున్నట్లు చెప్పిన సంయుక్త కిసాన్ మోర్చా కూడా పార్లమెంట్‌లో ప్రక్రియ పూర్తయే వరకు వేచి చూస్తామని ప్రకటించింది. ఇప్పటివరకూ లఖింపూర్ ఘటన సహా 700 మంది రైతులు అమరులయ్యారని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. రైతుల ఆందోళన కేవలం నల్ల చట్టాల రద్దు కోసమే కాకుండా గిట్టుబాటు ధర కోసం కూడా అని స్పష్టం చేసింది సంయుక్త కిసాన్ మోర్చా. ఇదే అసలైన సమస్య అని, ఇది పరిష్కారం కాలేదని తెలిపింది. ఎలక్ట్రికల్ అమెండమెంట్ బిల్లు కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story