ఢిల్లీ సరిహద్దులో వెనక్కు తగ్గిన కేంద్రం

ఢిల్లీ సరిహద్దులో వెనక్కు తగ్గిన కేంద్రం
అడ్డుగా సిమెంట్ దిమ్మలు, భారీగా బారీకేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. రోడ్లపై మేకులు కూడా పాతారు.

ఢిల్లీ సరిహద్దులో కేంద్రం కాస్త వెనక్కు తగ్గింది. రైతులు రోడ్లపైకి రాకుండా అమర్చిన ఇనుప మేకులు తొలగించింది. రిపబ్లిక్‌ డే రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఢిల్లీ సరిహద్దులో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది కేంద్రం. దీనికి నిరసనగా ఎల్లుండి చక్కా జామ్ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రహదారులు దిగ్బంధించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రైతులు రోడ్ల మీదకు రాకుండా అడ్డుగా సిమెంట్ దిమ్మలు, భారీగా బారీకేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. రోడ్లపై మేకులు కూడా పాతారు.

ఓవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున భద్రతా ఏర్పాట్లు భారీగా చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ భద్రతా ఏర్పాట్లపై వ్యతిరేకత రావడంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. రోడ్లపై పాతిన ఇనుప మేకులను తొలగించింది. అయితే, సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దులను మాత్రం పూర్తిగా మూసివేసి ఉంచుతామని పోలీసులు తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story