జాతీయం

Madhya Pradesh: ప్రేమించిన వాడితో యువతి షికారు.. అది చూసిన తండ్రి..

Madhya Pradesh: మామూలూగా ప్రేమించుకున్న వారు సరదాగా కలిసి తిరగాలనుకుంటారు.

Madhya Pradesh: ప్రేమించిన వాడితో యువతి షికారు.. అది చూసిన తండ్రి..
X

Madhya Pradesh: మామూలూగా ప్రేమించుకున్న వారు సరదాగా కలిసి తిరగాలనుకుంటారు. అందుకే వారు చాలావరకు ఇంట్లో తెలియకుండా లాంగ్ డ్రైవ్‌లు అంటూ, పార్క్‌లు అంటూ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. అలా వెళ్లిన ఒక ప్రేమ జంట తల్లిదండ్రలు కంట్లో పడితే..? అలా వారిని చూసిన తండ్రికి కోపం కట్టలు తెంచుకుంటే..? ఇలాంటి ఒక ఘటనే మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో జరిగింది.

ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఓ ప్రేమజంట నడుచుకుంటూ వెళ్తోంది. అనుకోకుండా అదే వైపుకు వచ్చాడు ఆ అమ్మాయి తండ్రి. తన కూతురు ఆ యువకుడితో తిరుగుతూ తప్పుడుగా ప్రవర్తిస్తోందని భావించాడా తండ్రి. అందుకే ఆయనకు తట్టుకోలేనంత కోపం వచ్చింది. అంతే.. రోడ్డు మీదే బెల్ట్‌ తీసి ఆ యువకుడిని చావబాదాడడం మొదలుపెట్టాడు. మధ్యలో వచ్చిన కూతురిని కూడా కొట్టాడు.

ఘటనాస్థలంలో ఉన్న పలువురు ఈ సంఘటనను వీడియో తీసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, యువతి తండ్రిపై యువకుడు స్థానిక తిమర్ని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాపు చేస్తున్నామన్నారు.

Next Story

RELATED STORIES