కోట్ల విలువైన కోహ్లీ కారు పోలీస్ స్టేషన్లో..

కోట్ల విలువైన కోహ్లీ కారు పోలీస్ స్టేషన్లో..
మహారాష్ట్రలోని పోలీస్ స్టేషన్లో పడి ఉంది. దాన్నిండా దుమ్ము, ధూళి. కారు స్టేషన్లో ఉందంటే కారణం ఏమై ఉంటుంది అనే అనుమానం

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో ఒకడు. భారత కెప్టెన్‌కు భారీ ప్రజాదరణ ఉంది. అందుకే అతడు కొన్ని వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్. క్రికెట్ మైదానంలో బ్యాటింగ్‌తో చెలరేగిపోతాడు.. ప్రకటనలతో యువతను ఆకర్షిస్తాడు.

విరాట్ కోహ్లీ గ్యారేజీ ఖరీదైన కార్లతో నిండి ఉంటుంది. బ్యాటింగ్ స్టార్ ప్రపంచంలో అతి విలువైన కారు 'ఆడి' ఇండియా బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఆడి నుంచి వచ్చిన ప్రతి కొత్త మోడల్‌ని ఇండియాలో కోహ్లీనే లాంఛ్ చేస్తాడు.

కాబట్టి విరాట్ కోహ్లీకి ప్రతిసారీ కొత్త కారు వస్తూనే ఉంటుంది. మరి పాత వాటిని ఏం చేస్తాడు. ఈ ప్రశ్న చాలా మంది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాగా, అతడి పాత కార్లలో ఒకటి మహారాష్ట్రలోని పోలీస్ స్టేషన్లో పడి ఉంది. దాన్నిండా దుమ్ము, ధూళి పేరుకుని ఉంది. కారు స్టేషన్లో ఉందంటే కారణం ఏమై ఉంటుంది అనే అనుమానం అభిమానులకి.. అయితే మీరు ఊహించుకున్నంత లేదు..

ఆడి ఇండియా కొత్త R8 ను విడుదల చేసినప్పుడు, విరాట్ కోహ్లీ తాను ఉపయోగిస్తున్న పాత మోడల్‌ను విక్రయించాడు. ఇది 2012 ఆడి R8 కోహ్లీ మొదటి కారు. 2016 లో, అతను దానిని బ్రోకర్ ద్వారా సాగర్ ఠక్కర్ అనే వ్యక్తికి విక్రయించాడు. సాగర్ తరువాత ఒక కుంభకోణానికి పాల్పడడంతో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ప్రియురాలికి బహుమతిగా ఇవ్వడానికి అతను ఈ కారును కోహ్లీ నుంచి కొనుగోలు చేశాడు. దాని తరువాత సాగర్ మెగా కుంభకోణంలో చిక్కుకున్నందున ముంబై పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

కుంభకోణం బయటపడిన తరువాత సాగర్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ముంబై పోలీసులు అతని ఆస్తులపై దాడి చేసి ఆడి ఆర్ 8 ను స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ, కోహ్లీ కారు అమ్మకానికి సంబంధించిన పత్రాలన్నీ సరిగానే పూర్తి చేశాడు. అందుచేత కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న తరువాత కోహ్లీ ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోలేదు. సాగర్ సుమారు 2.5 కోట్ల రూపాయలకు కారును కొనుగోలు చేసిన రెండు నెలల్లోనే పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి ఆ వాహనం ముంబై పోలీస్ స్టేషన్‌లో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story