Top

ఫ్లిప్‌కార్ట్ లో భారీగా ఉద్యోగావకాశాలు..

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవాలని యోచిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ లో భారీగా ఉద్యోగావకాశాలు..
X

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవాలని యోచిస్తోంది. రాబోయే పండుగ సీజన్ ని దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు చేపట్టాలనుకుంటోంది. వచ్చే నెలలో ఫ్లాగ్ షిప్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున నియాకాలు చేపట్టనుంది. ఫ్లిప్ కార్ట్ కు చెందిన ఈకార్ట్ అండ్ మార్కెట్ ప్లేస్ ఉపాధ్యక్షుడు అమితేష్ ఝూ మాట్లాడుతూ ఉపాధి కల్పన, విక్రయదారుల వ్యాపారాన్ని పెంచడం, ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై తమ వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ కొత్తగా నియమించుకునే ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనుంది. ఇందులో సర్వీస్, డెలివరీ, ఇన్ స్టాలేషన్, సేప్టీ, శానిటైజేషన్ చర్యలు, పీఓఎస్ మెషీన్లు, స్కానర్లు, వివిధ రకాల మొబైల్ అప్లికేషన్లు, ఈఆర్ పీ వంటివి ఉన్నాయి. కరోనా కారణంగా మందగించిన అమ్మకాలు ఈ మధ్య కాస్త పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయి.

Next Story

RELATED STORIES