మార్చి 31 లోగా బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో లింక్‌ కావాలి : ఆర్థిక మంత్రి

మార్చి 31 లోగా బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో లింక్‌ కావాలి : ఆర్థిక మంత్రి

2021 మార్చి 31 లోగా బ్యాంకు ఖాతాలు వినియోగదారుల ఆధార్‌ నంబర్లతో అనుసంధానం అయ్యేలా చూడాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకులకు సూచించారు. ఇప్పటికీ చాలా ఖాతాలు ఆధార్‌తో లింక్‌ కాలేదన్నారామె. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ 73వ వార్షిక సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఖాతాతో పాన్‌ నంబర్‌, ఆధార్‌ తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలన్నారు. డిజిటల్‌ పేమెంట్స్‌ పెంచే దిశగా బ్యాంకులన్నీ నడవాలని సూచించిన ఆమె నాన్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించవద్దన్నారు. బ్యాంకులు యూపీఐ లావాదేవీల విధానాలను అలవరచుకోవాలన్నారు. అన్ని బ్యాంకులకు 'యూపీఐ' పరిభాష పదంగా ఉండాలన్నారు. దీంతో పాటు రూపేకార్డులను ప్రోత్సహించాలన్నారు. కార్డు అవసరం ఉన్నవారికి బ్యాంకులు ప్రోత్సహించి అందించే కార్డు రూపే మాత్రమే అయి ఉండాలని ఆమె వివరించారు. దేశానికి పెద్ద బ్యాంకుల సేవల అవసరముందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.




Tags

Read MoreRead Less
Next Story