మాజీ CJI రంజన్ గొగోయ్‌కు జడ్ ప్లస్ భద్రత!
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పిస్తోంది. దీంతో దేశంలో ఆయన పర్యటించేటప్పుడు 8-12 మంది CRPF జవాన్లు ఆయనకు భద్రతగా ఉంటారు.

X
Vamshi Krishna22 Jan 2021 12:00 PM GMT
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పిస్తోంది. దీంతో దేశంలో ఆయన పర్యటించేటప్పుడు 8-12 మంది CRPF జవాన్లు ఆయనకు భద్రతగా ఉంటారు. అటు ఆయన నివాసం వద్ద కూడా భద్రతను పెంచుతారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న గొగోయ్‌కు ఇప్పటివరకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. తాజా ఆదేశాలతో దేశంలో జడ్ ప్లస్ భద్రత పొందుతున్న 63 మందిలో ఒకరిగా మాజీ CJI చేరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయి.. 2019లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
Next Story