మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపలు.. రోజుకో మలుపు తిరుగుతున్న సచిన్ వాజే వ్యవహారం

మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపలు.. రోజుకో మలుపు తిరుగుతున్న సచిన్ వాజే వ్యవహారం
సచిన్ వాజే వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నేరుగా కోర్టుకు లేఖ ఇస్తానని సచిన్ వాజే ప్రకటించడంతో మహారాష్ట్ర సర్కారుకు ముచ్చెమటలు పడుతున్నాయి

మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపలు కొనసాగుతున్నాయి. సచిన్ వాజే వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నేరుగా కోర్టుకు లేఖ ఇస్తానని సచిన్ వాజే ప్రకటించడంతో మహారాష్ట్ర సర్కారుకు ముచ్చెమటలు పడుతున్నాయి. సచిన్ వాజే ఇంకెంతమంది రాజకీయ నేతల పేర్లు బయటపెడతాడోనని టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 100 కోట్ల వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొన్న హోమంత్రి అనిల్... చివరికి రాజీనామా చేయక తప్పలేదు.

ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ NIA దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో తవ్వినకొద్దీ రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తుండడంతో ఇన్నాళ్లు సమర్ధించిన పార్టీ పెద్దలు కూడా దూరం జరిగిపోతున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే... అనిల్‌ను, సచిన్ వాజేను వెనకేసుకొచ్చారు. బాంబు బెదిరింపుల కేసులో వాజే పాత్ర బయటపడ్డాక దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛను ఇచ్చారు. అటు శరద్ పవార్ కూడా అనిల్ రాజీనామా చేయబోరంటూ మొదట స్పష్టం చేసినా... ఆ తర్వాత ఆయన కూడా వెనక్కి తగ్గారు.

మహారాష్ట్ర సర్కారుపై ప్రతీకారం తీర్చుకునే అస్త్రం సచిన్ వాజే రూపంలో బీజేపీ చేతికి దొరికింది. దీంతో ఈ కేసులో కీలక విషయాలను బయటపెట్టిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్... సర్కారుపై ఆరోపణలు చేశారు. దీంతో ఉద్దవ్ ఠాక్రే సర్కారు ఇరుకున పడింది. ఇక ఇప్పుడు సచిన్ వాజే డైరెక్టుగా న్యాయస్థానానికి లేఖ ఇవ్వబోతుండడంతో అందులో ఇంకెంతమంది ప్రముఖుల పేర్లు ఉన్నాయోననే ఉత్కంఠత కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story