CDS : బిపిన్ రావత్ స్థానంలో మనోజ్ ముకుంద్?
CDS : తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ఘోర ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే..

CDS : తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ఘోర ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.. నేడు ఢిల్లీకి ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలావుండగా బిపిన్ రావత్ మరణంతో తదుపరి CDS ఎవరనే చర్చ నడుస్తోంది. ఇంతటి విషాదకరమైన సమయంలో భద్రత విషయంలో రాజీపడరాదనే సూత్రాన్ని అనుసరిస్తూ ప్రధాని మోదీ అత్యవసర క్యాబినెట్ భేటి నిర్వహించి తరవాత CDS నియామకం పై చర్చించినట్లు సమాచారం.
ప్రస్తుత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణేను తదుపరి CDSగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వైఎస్ CDSగా ఉన్న ఎయిర్ మార్షల్ రాధాకృష్ణ పేరును కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఆర్మీ చీఫ్‌గా వచ్చే ఏడాది ఏప్రిలో నరవాణె పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే సవరించి ఆర్మీ నిబంధనల ప్రకారం.. సీడీఎస్ 65 ఏళ్లు వచ్చే వరకు సేవలందించే అవకాశముంది. వాస్తవానికి వచ్చే ఏడాది సీడీఎస్ పదవి నుంచి జనరల్ బిపిన్ రావత్కూడా రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంది. కానీ అంతలోనే ఇలా జరగడంతో తదుపరి సీడీఎస్ ఎంపికపై ముందస్తుగా కసరత్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
RELATED STORIES
Manchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTRakul Preet Singh: మాట్లాడుకోవల్సింది మా పర్సనల్ లైఫ్ గురించి కాదు:...
23 May 2022 6:51 AM GMTAishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్..? బాలీవుడ్లో రూమర్స్ వైరల్..
22 May 2022 3:45 PM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMT