EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త..

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త..
EPFO: 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును సంస్థ మార్చకుండా ఉంచింది.

EPFO: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచి 8.50 శాతం వడ్డీని పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు సంస్థ తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేట్లు యధాతథంగా ఉంచింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువ విత్ డ్రా ఉన్నందున 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును సంస్థ మార్చకుండా ఉంచింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్‌ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయికి (8.5శాతం) తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతం కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చిన ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు.. పోర్టల్ ఓపెన్ చేయాలి. http://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేసేందుకు యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయాలి.

సైన్ ఇన్ చేసిన తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story