ఇల్లు కొనాలనుకుంటే ఇదే మంచి తరుణం..

ఇల్లు కొనాలనుకుంటే ఇదే మంచి తరుణం..
కరోనా వైరస్ వచ్చి ప్రాపర్టీ ధరలను కూడా బాగా తగ్గించింది.

ఇల్లు కొనాలనే కలను నిజం చేసుకునే అవకాశం ఇప్పుడే వచ్చింది. ఎందుకంటే పండుగ సీజన్ నేపథ్యంలో ఆపర్ల పరంపర కొనసాగుతోంది. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేస్తున్నాయి. ఇక కరోనా వైరస్ వచ్చి ప్రాపర్టీ ధరలను కూడా బాగా తగ్గించింది. బ్యాంకులైతే హోమ్ లోన్స్‌ను 7 శాతం తక్కువ వడ్డీకే అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 7 శాతం కంటే తక్కువ వడ్డీకే లోన్స్ అందిస్తోంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా 7 శాతం లోపు హోమ్ లోన్స్ అందిస్తోంది.

కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ పీజును మొత్తానికి మాఫీ చేస్తే మరికొన్ని సగం తగ్గించి ఇల్లు కొనుగోలు దారులకు ఊరట కలిగిస్తున్నాయి. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, డెవలపర్లు ప్రాపర్టీ ధరలో 10 నుంచి 15 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నాయి. అందువలన ఈ సమయంలో కొత్తగా ఇల్లు కొనేవారికి కొంతైనా భారం తగ్గుతుందని భావించవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రిజిస్ట్రేషన్ ఫీజులో 3 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story