వాహనదారులకు శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్..

వాహనదారులకు శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్..
డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం వాహన దారులకు కొంత ఊరట కల్పించింది. డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ వంటి పలు వాహన సంబంధిత డాక్యుమెంట్ల గడువును తాజాగా 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. దీనికి సంబంధించి రోడ్డు&రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఫిట్‌నెస్, పర్మిట్ (అన్ని రకాల), లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్స్ గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడిగించినట్లు కేంద్రం ట్వీట్ చేసింది.

ఈ చర్య వల్ల వాహనదారులు సామాజిక దూరాన్ని పాటిస్తూ రవాణా సంబంధిత సేవలను పొందవచ్చు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే గతంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. ఇంతకు ముందు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆర్టివో కార్యాలయంలో టెస్ట్ నిర్వహించేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వం గుర్తించిన, అర్హత కలిగిన కేంద్రాల్లో డ్రైవింగ్ టెస్ట్ పాసైతే సరిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story