covid guidelines: పిల్లలలో కోవిడ్.. మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

covid guidelines: పిల్లలలో కోవిడ్.. మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కోవిడ్ -19 నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది.

Guidelines on Covid : 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కోవిడ్ -19 నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్ఎస్) జారీ చేసిన మార్గదర్శకాలలో అంటువ్యాధులు మరియు తేలికపాటి సంక్రమణ కేసులలో స్టెరాయిడ్లవాడకం హానికరం అని పేర్కొంది.

తీవ్ర అనారోగ్యంతో ఉన్న కోవిడ్ -19 కేసులలో మాత్రమే DGHS స్టెరాయిడ్లను సిఫార్సు చేసింది. "స్టెరాయిడ్లను సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన వ్యవధిలో వాడాలి. సొంతంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం అత్యంత హానికరం అని పేర్కొంది.

రెమ్‌డెసివిర్ వాడకం గురించి చెబుతూ.. పిల్లలకు అత్యవసర ఔషధమైన రెమ్‌డెసివిర్‌ను సిఫారసు చేయబడలేదని కేంద్ర మార్గదర్శకాలు తెలిపాయి. కరోనా సోకిన రోగులలో ఊపిరితిత్తుల పని తీరుని చూడటానికి CT స్కాన్ అవసరమైతేనే తీయించాలని మార్గదర్శకాలు సూచించాయి.లక్షణాలు లేని తేలికపాటి కేసులకు కోవిడ్ -19 ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని, సంక్లిష్టమైన కోవిడ్ -19 సంక్రమణ చికిత్సలో యాంటీమైక్రోబయాల్స్ పాత్ర లేదని మార్గదర్శకాలు తెలిపాయి.

తప్పని పరిస్థితుల్లోనే ఆసుపత్రులకు వెళ్లాలని సూచించింది. అనవసరంగా వెళితే అంటువ్యాధుల బారిన పడే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కోవిడ్ పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేని చిన్నారులకు మందులను సిఫారసు చేయలేదు. కానీ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, సామాజిక దూరం పాటించడంతో పాటు పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వమని సూచించాయి.

తేలికపాటి జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలకు పారాసెటమాల్ 10-15 ఎంజి మోతాదు ప్రతి 4-6 గంటలకు ఒకసారి ఇవ్వొచ్చని పేర్కొంది. పెద్ద పిల్లలకు అంటే కౌమారదశలో ఉన్న వారికి గోరు వెచ్చని నీటితో గార్గ్లింగ్ చేయమని సూచించింది. కేసుల తీవ్రతను బట్టి తక్షణ ఆక్సిజన్ చికిత్సను ప్రారంభించాలని పేర్కొంది.

తల్లిదండ్రులు / సంరక్షకుల పర్యవేక్షణలో 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆరు నిమిషాల నడక పరీక్షను కూడా మార్గదర్శకాలు సిఫార్సు చేశాయి. "ఇది కార్డియోపల్మోనరీ పనితీరును అంచనా వేయడానికి ఒక సాధారణ క్లినికల్ పరీక్ష. చిన్నారుల వేలికి పల్స్ ఆక్సిమీటర్‌ను అటాచ్ చేసి వారిని గదిలోనే అటూ, ఇటూ ఆరు నిమిషాల పాటు నడవమని చెప్పాలి. దాంతో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు అని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story