Uttarakhand Floods : ఉత్తరాఖండ్‌కు రూ.12 కోట్లు విరాళం ఇచ్చిన హర్యానా సీఎం!

Uttarakhand Floods : ఉత్తరాఖండ్‌కు రూ.12 కోట్లు విరాళం ఇచ్చిన హర్యానా సీఎం!
ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. NDRF బృందాలు ఇప్పటిదాకా 31 మృతదేహాలను వెలికి తీశాయి. NDRF, భద్రతా దళాలు 30 మందిని రక్షించాయి.

ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. NDRF బృందాలు ఇప్పటిదాకా 31 మృతదేహాలను వెలికి తీశాయి. NDRF, భద్రతా దళాలు 30 మందిని రక్షించాయి. గల్లంతైన మరో 160 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు వరద బీభత్సానికి గురైన చాలా గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు.

మరోవైపు తపోవన్ జల విద్యుత్ కేంద్రంలోని 120 మీటర్ల టెన్నెల్‌లో పేరుకుపోయిన బురదను సహాయక బృందాలు తొలగించాయి. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్... వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత వరద నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది కార్మికులను ఆయన పరామర్శించారు.

వీలైనంత ఎక్కువ మందిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తెలిపారు. మరోవైపు వరదలతో దెబ్బతిన్న ఉత్తరాఖండ్‌ను ఆదుకోడానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిధికి హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ 12 కోట్లు విరాళంగా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story