హథ్రస్ ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

హథ్రస్ ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రస్ ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. శనివారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు... నేటి నుంచి దర్యాప్తు ప్రారంభించింది. సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అటు... ఈ ఘటనపై చాంద్‌పా పోలీసు స్టేషన్‌లో బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు... ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సెప్టెంబరు 14న తన సోదరిని... నలుగురు వ్యక్తులు అత్యాచారం, దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story