రాజ్ తరుణ్ గృహప్రవేశం.. అవికాకు స్పెషల్ ఇన్విటేషన్

రాజ్ తరుణ్ గృహప్రవేశం.. అవికాకు స్పెషల్ ఇన్విటేషన్
అలాగే నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. అమి తుమాకో భాలో బాషి (నేను నిన్ను ప్రేమిస్తున్నాను) అంటూ నటుడు రాజ్ తరుణ్

ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు హిట్టయ్యాయి. మొదటి చిత్రం ఉయ్యాల జంపాల, ఆ తరువాత వచ్చిన సినిమా చూపిస్త మావ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. గురువారం రాజ్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. నూతన గృహ ప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు అవికా గోర్ విచ్చేశారు. పూజా కార్యక్రమం అనంతరం అవిక.. రాజ్ కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్ తరుణ్.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. అలాగే నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. అమి తుమాకో భాలో బాషి (నేను నిన్ను ప్రేమిస్తున్నాను) అంటూ నటుడు రాజ్ తరుణ్ గురించి క్యూట్ పోస్ట్ పెట్టారు నటి అవికాగోర్. అనంతరం అవికాతో దిగిన ఓ ఫోటోని రాజ్ తరుణ్ .. నా మొదటి చిత్రం నుంచి మా గృహప్రవేశం వరకు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు అవికా అని పేర్కొన్నారు. కాగా ఒరేయ్ బుజ్జిగాతో విజయం అందుకున్న రాజ్ తరుణ్.. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story