High Court : ఉమ్మడి స్థలం ప్లాట్ల యజమానులదే

High Court : ఉమ్మడి స్థలం ప్లాట్ల యజమానులదే
అవిభాజ్య వాటాకు సొమ్ము చెల్లించలేదనే బిల్డర్‌ వాదనతో ఏకీభవించలేమని స్పష్టం

అపార్ట్‌మెంట్లలో కామన్‌ ఏరియా విషయంలో.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉమ్మడి స్థలం ప్లాట్ల యజమానులదేనని స్పష్టం చేసింది. ఈ స్థలంపై బిల్డర్‌కు ఎలాంటి హక్కు ఉండదన్నారు. అపార్ట్‌మెంట్‌లోని ఉమ్మడి స్థలం, అందులో అభివృద్ధి చేసిన సౌకర్యాలు.. ఫ్లాట్ల యజమానులకే చెందుతాయని తేల్చిచెప్పింది. చెన్నై ఆళ్వార్‌పేటలోని ఓ స్థలంలో 2001లో రమణీయం రియల్‌ ఎస్టేట్‌ సంస్థ 77 ఫ్లాట్లు నిర్మించి విక్రయించింది.

దీంతో పాటు ఉమ్మడి స్థలంలో ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ భవనాన్ని నిర్మించి తానే యజమానిగా పేర్కొంటూ ఓ వ్యక్తికి అమ్మేసింది. దీనిపై అబోట్స్‌బరీ ఓనర్ల అసోసియేషన్‌ హైకోర్టులో వ్యాజ్యం వేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. బిల్డర్‌ వ్యవహార శైలిని తప్పుపట్టింది. అవిభాజ్య వాటాకు సొమ్ము చెల్లించలేదనే బిల్డర్‌ వాదనతో ఏకీభవించలేమని స్పష్టం చేసింది. స్థలం ఒకసారి కామన్‌ ఏరియా, కామన్‌ సౌకర్యాల అభివృద్ధి కోసం అని పేర్కొన్నాక ఆ భూమి ఫ్లాట్ల యజమానులకే చెందుతుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story