Himanta Biswa Sarma : రాజకీయంగా దుమారం రేపుతున్న సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలు

Himanta Biswa Sarma :  రాజకీయంగా దుమారం రేపుతున్న  సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలు
Himanta Biswa Sarma : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

Himanta Biswa Sarma : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 2016లో పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగిందనడానికి సాక్ష్యం ఏదని అడిగిన రాహుల్‌ను ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. రాహుల్‌ ఎవరికి పుట్టారో సాక్ష్యం కావాలని మేం అడిగామా అంటూ ప్రశ్నించారు.

తాజాగా యూపీసీఎం ఆధిత్యనాథ్ కూడా రాహుల్ గాంధీ, ఆయన కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ముత్తాత తనను తాను యాక్సిడెంటల్ హిందువుగా చెప్పుకునేవారని..... అలాంటి రాహుల్ గాంధీ కూడా ఇవాళ హిందుత్వానికి నిర్వచనం చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తమ పూర్వీకులు హిందువులమని చెప్పుకోవడానికి వీళ్లలా అవమాన పడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతమైపోయిందన్న యోగి.. మిగిలినదాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

అటు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను ఖండించారు సీఎం కేసీఆర్. దేశంకోసం ఎంతో చేసిన ఘనచరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన రాహుల్‌ గురించి అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. రాహుల్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కించపరుస్తారా అంటూ అగ్రహంవ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడటమే బీజేపీ సంస్కారమా అని నిలదీశారు.

అసోం సీఎంను వెంటనే భర్తరప్‌ చేయాలని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను డిమాండ్‌ చేశారు. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. బిశ్వశర్మ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story