ఆ దేశాల్లో ఎయిర్ ఇండియాకు నో ఎంట్రీ..

ఆ దేశాల్లో ఎయిర్ ఇండియాకు నో ఎంట్రీ..
విమానంలో ఓ ప్రయాణికుడికి పాజిటివ్ రావడంతో హాంకాంగ్ ప్రభుత్వం విమానాల రాకపోకలను మరోసారి నిషేధించింది.

కరోనా సంక్షోభంలో వందే భారత్ మిషన్ పథకం కింద విదేశీయులను వారి స్వస్థలాలకు చేరవేస్తున్న ఎయిర్‌ఇండియాకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. విమానంలో ఓ ప్రయాణికుడికి పాజిటివ్ రావడంతో హాంకాంగ్ ప్రభుత్వం విమానాల రాకపోకలను మరోసారి నిషేధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు హాంకాంగ్‌కు ఎయిర్ ఇండియా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు కూడా ప్రయాణీకులకు పాజిటివ్ రావడంతో ఆగస్ట్ 18నుంచి 31 వరకు హాంకాంగ్ ఎయిర్ ఇండియా విమానాలను సస్సెండ్ చేసింది.. ఇప్పుడు మళ్లీ రెండవసారి నిషేధం.

ఈనెల 18న హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులు కరోనా బారిన పడ్డారు. వీరంతా కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లినట్లు తెలిసింది. ప్రయాణానికి ముందు నెగెటివ్ వచ్చింది.. అక్కడ దిగిన తరువాత టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 3 వరకు రెండు వారాలు నిషేధాన్ని విధిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ అధారిటీ ప్రకటించింది. కాగా ఇదే ఆరోపణతో దుబాయ్ కూడా ఎయిర్ ఇండియా విమానాలను అక్టోబర్ 2 వరకు నిలిపివేసింది.

Tags

Read MoreRead Less
Next Story