మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోమంటారు..: ఆనంద్ మహీంద్రా ట్వీట్

మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోమంటారు..: ఆనంద్ మహీంద్రా ట్వీట్
మనం ధనవంతులైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు

డబ్బులెక్కువుంటే ఓ మంచి పనికి వాడండి.. కారు బంగారందే అయినా పెట్రోల్ పోయిందే నడవదు కదా. మీ హోదాని ఈ విధంగానా ప్రదర్శించేది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాకు చిర్రెత్తుకొచ్చింది. డబ్బులు ఎలా ఖర్చుపెట్టకూడదో ఈ వీడియో చూసి నేర్చుకోండి అని హితవు పలికారు. ఇంతకీ విషయం ఏంటంటే.. అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన ఫెరారీ కారేసుకుని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు.

అందులో వింతేముంది అని అనుకోకండి. అది మామూలు కారు కాదు బాబు.. బంగారం లాంటి కారు.. స్వచ్ఛమైన 24 క్యారెట్‌తో చేసిన గోల్డ్ కారు. చిన్నమెత్తు బంగారం కొనాలంటేనే వేలకి వేలవుతుంది. మరి కారుకి కవరింగ్ అంతా బంగారంతోనే అంటే ఇంకెంత డబ్బు ఖర్చయ్యుంటుంది. ఆయన సంపాదన, ఆయన ఇష్టం అని అనుకున్నా.. అదేదో ఓ మంచి పనికి పది మందికి ఉపయోగపడేది అయితే బావుండేది కదా అని ఆనంద్ గారి ఆంతర్యం.

కారుకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ ఇద్దరు వ్యక్తులు అందులో కూర్చుని వీధుల్లో తిరుగుతున్నారు. దాన్ని చూసిన చుట్టు పక్కల వారు నొరెళ్ల బెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ వీడియోపైన 'ఇండియన్ అమెరికన్ విత్ ప్యూర్ గోల్డ్ ఫెరారీ కార్' అని రాసి ఉంది.

ఇది సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చక్కర్లు కొడుతుందో నాకు అర్థం కావడం లేదు. మనం ధనవంతులైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. అని మహీంద్రా ట్వీట్ చేశారు. పోస్ట్ చేసిన 24 గంటల్లోనే ఆ అభిప్రాయానికి మద్దతు తెలుపుతూ 6 వేల మంది లైక్ చేశారు. 1,70,000 మంది వీడియోని వీక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story