వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు రావాలంటే.. ఇలా చేస్తే సరి..

వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు రావాలంటే.. ఇలా చేస్తే సరి..
గ్యాస్ ధర తక్కువగా ఉన్నప్పుడు సబ్సీడీ తక్కువ వస్తుంది. అయితే ప్రస్తుతం గ్యాస్ ధర ఎక్కువగా ఉంది కాబట్టి సబ్సీడీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

వంట గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్నాయి. గ్యాస్ బండ వినియోగదారుడి నెత్తిపై గుదిబండగా మారింది. కేవలం రెండు నెలల కాలంలోనే రెండు వందల రూపాయలు పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. గ్యాస్ సిలిండర్ తీసుకునేవాళ్లు సబ్సిడీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గ్యాస్ ధర తక్కువగా ఉన్నప్పుడు సబ్సీడీ తక్కువ వస్తుంది. అయితే ప్రస్తుతం గ్యాస్ ధర ఎక్కువగా ఉంది కాబట్టి సబ్సీడీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఐతే సబ్సిడీ రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. మీ ఆధార్ కార్డ్ గ్యాస్ కంపెనీతో కనెక్ట్ కాకపోయినా, బ్యాంక్ ఖాతాతో ఆధార్ నంబర్ అనుసంధానం కాకపోయినా సబ్సిడీ రాదు.

సబ్సిడీ అందరికీ వర్తిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే సబ్సిడీ రాదు. అలాగే వివాహం చేసుకున్నాక భార్యా భర్తల ఆదాయం 10 లక్షలు దాటితే వారికి కూడా సబ్సిడీ రాదు.

ఓ నివేదిక ప్రకారం గ్యాస్ సబ్సిడీ 153.86 నుండి 291.48కి పెరిగింది. ఉజ్వల పథకం వారికి 174.86 నుండి రూ.312.48 సబ్సిడీ వస్తుంది. అంటే సుమారు రూ.300 సబ్సిడీ వర్తించే వారికి ఆదా అవుతుంది.

సబ్సిడీ పొందడానికి ఎల్పీజీ కనెక్షన్‌కి ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. బ్యాంకు ఖాతాకి లింకు చేస్తేనే మీ సబ్సిడీ పొందగలరని తెలుసుకోండి.

ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం

మీ నమోదైన మొబైల్ నెంబర్ నుండి ఎల్పీజీ కనెక్షన్ కంపెనీకి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. యునిక్ ఐడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార నంబర్ టైప్ చేసి గ్యాస్ కనెక్షన్ నంబరుకి మెసేజ్ పెడితే నిర్ధారణ కోసం మీకు ఒక మెసేజ్ వస్తుంది. దాని తరువాత మీ ఆధార్ నంబర్ గ్యాస్ కనెక్షన్ కంపెనీతో కనెక్ట్ అవుతుంది.

బ్యాంకు ఖాతాకి ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలంటే, ఆధార్ కార్డుని, ఖాతా పుస్తకాన్ని బ్యాంకులో ఇస్తే సరిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story