చిన్నారుల కోసం ప్రొటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ..

చిన్నారుల కోసం ప్రొటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ..
ఇంట్లోనే చిన్నారుల కోసం ఈజీగా ప్రొటీన్ పౌడర్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం

పాలు తాగనని మారం చేసే పిల్లల కోసం బజార్లో దొరికే ఏదో ఒక పౌడర్ కలిపి తాగించే ప్రయత్నం చేస్తుంటారు ఇంట్లోని పెద్దవాళ్లు. అందులో అధిక మోతాదులో చక్కెర ఉంటుంది. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాటి బదులు ఇంట్లోనే చిన్నారుల కోసం ఈజీగా ప్రొటీన్ పౌడర్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. పోషకాహార నిపుణులు సూచించిన పదార్థాలు ఉపయోగించి ప్రొటీన్ పౌడర్ తయారు చేసి పాలల్లో కలిపి ఇస్తే చిన్నారులు ఇష్టంగా తాగేస్తారు. ఈ పౌడర్ పిల్లలతో పాటు పెద్దవాళ్లకీ మంచిదే.

కావలసిన పదార్ధాలు.. నో ఫ్యాట్ మిల్క్ పౌడర్- 3 కప్పులు, వేయించిన ఓట్స్ - 1 కప్పు, వేయించిన బాదం పౌడర్ ఒక కప్పు, పిస్తా పప్పులు 1 కప్పు, స్పూన్ ఇలాచీ పౌడర్, సరిపడినంత బెల్లం లేదా పటిక బెల్లం పొడి. వీటన్నింటినీ కలిపి మిక్సీ చేయాలి. ఈ పౌడర్‌ని గాలి చొరబడిని డబ్బాలో నిల్వ చేసి ఉంచాలి. రోజూ 1 లేదా 2 స్పూన్లు గ్లాసు పాలల్లో కలిపి చిన్నారులకు ఇవ్వొచ్చు. కూల్‌గా తాగడాన్ని పిల్లలు ఇష్టపడతారు కాబట్టి ఓ పది నిమిషాలు కాచిన పాలు ఫ్రిడ్జ్‌లో ఉంచి ఆ తరువాత పౌడర్ కలిపి ఇస్తే ఒక్క చుక్క కూడా వదలకుండా తాగేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story