ఏటీఎంతో పన్లేదు.. ఆధార్ నెంబర్ ఉంటే అకౌంట్‌లో డబ్బులు ఈజీగా..

ఏటీఎంతో పన్లేదు.. ఆధార్ నెంబర్ ఉంటే అకౌంట్‌లో డబ్బులు ఈజీగా..
దీనికి ఏటీఎం కార్డు, పిన్ నెంబర్ వంటి వాటితో పన్లేదు.

ఆధార్ కార్డ్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌తో లింకై ఉంటే డబ్బు డ్రా చేసుకోవడం ఈజీ అవుతుంది. ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ AePS ద్వారా సులభంగా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి ఏటీఎం కార్డు, పిన్ నెంబర్ వంటి వాటితో పన్లేదు. ఏటీఎం కార్డుతో ఏటీఎం మెషీన్ ద్వారా డబ్బులు తీసుకున్నట్లే.. ఆధార్ ఆధారిత ఏటీఎం మెషీన్ ద్వారా ఆధార్ కార్డుతో డబ్బులు తీసుకోవచ్చు. కేవలం డబ్బులు తీసుకోవడం మాత్రమే కాకుండా డిపాజిట్ కూడా చేయొచ్చు.

బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు. లోన్ డబ్బులు కట్టేయొచ్చు. పాన్ కార్డు, ఈకేవైసీ వంటి సేవలు కూడా పొందొచ్చు. ఇకపోతే మైక్రో ఏటీఎంలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా కూడా ఆధార్ సేవలు పొందొచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI తీసుకువచ్చిన ఏఈపీఎస్ సర్వీసుల ద్వారా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఆధార్ డేటా సాయంతో కస్టమర్లకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ విధానంలో ఫింగర్ ప్రింట్, మొబైల్ నెంబర్ అనేవి డెబిట్ కార్డ్ మాదిరిగానే పని చేస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story