జాతీయం

Karnataka : జూనియర్‌ ఇంజనీర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. డ్రైనేజీ పైపుల్లో డబ్బులు పెట్టి..!

Karnataka : లంచావతారమెత్తిన ప్రభుత్వాధికారులు ఏసీబీ అధికారులకు చిక్కకుండా అవినీతి సొమ్మును ఎక్కడెక్కడో దాస్తున్నారు. అయినా అడ్డంగా దొరికిపోతున్నారు.

Karnataka :  జూనియర్‌ ఇంజనీర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. డ్రైనేజీ పైపుల్లో డబ్బులు పెట్టి..!
X

Karnataka : లంచావతారమెత్తిన ప్రభుత్వాధికారులు ఏసీబీ అధికారులకు చిక్కకుండా అవినీతి సొమ్మును ఎక్కడెక్కడో దాస్తున్నారు. అయినా అడ్డంగా దొరికిపోతున్నారు. కర్ణాటకలో ఏసీబీ దాడులే నిదర్శనం. కలబుర్గీలో.. ఓ జూనియర్ ఇంజనీర్ ఏకంగా డబ్బుల్ని డ్రైనేజీ పైపుల్లో పెట్టాడు. ఏసీబీ అధికారులకు అనుమానం వచ్చి..కర్ర తీసుకుని పైపులో పెట్టగా..అందులో నుంచి నోట్ల కట్టలు కింద పడ్డాయి. ప్లాస్టిక్ డబ్బా నోట్లతో పూర్తిగా నిండిపోయింది.

డ్రైనేజీ పైపులో నుంచి మొత్తం 13 లక్షలను రికవరీ చేశారు. ఇక ఆ జూనియర్‌ ఇంజనీర్‌ నుంచి 54 లక్షలు రికవరీ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కర్నాటకలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేశారు. లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది అధికారుల నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు. 68 ప్రదేశాల్లో సోదాలు జరిపారు. అధికారుల నివాసాల నుంచి డబ్బులు, విలువైన బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story

RELATED STORIES