తాత నీకు హ్యాట్సాఫ్... ఇంట్లో ఖాళీగా కూర్చోలేక..!

తాత నీకు హ్యాట్సాఫ్... ఇంట్లో ఖాళీగా కూర్చోలేక..!
98ఏళ్ల వయసులో కృష్ణా, రామా అనుకుంటూ ఓ మూలన కూర్చొని.. పెట్టింది తిని ఉండకుండా.. చేతనైన పని చేసుకుంటూ.. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు.

శరీరంలో అన్నీ అవయవాలు సరిగ్గా ఉన్నప్పటికీ పనిచేసేందుకు బద్దకిస్తారు కొందరు. ఆలాంటి వారు ఈ 98ఏళ్ల వృద్దున్నీ చూసి నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి... ఎందుకంటే 98ఏళ్ల వయసులో కృష్ణా, రామా అనుకుంటూ ఓ మూలన కూర్చొని.. పెట్టింది తిని ఉండకుండా.. చేతనైన పని చేసుకుంటూ.. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఈ వయసులో నీకు ఈ పని అవసరమా తాతా అని అడిగితే ఇంట్లో ఖాళీగా ఉండలేనని చెబుతున్నాడు. ఈ తాత చేస్తున్న పనికి జిల్లా మెజిస్ట్రేట్‌‌ అయనకి సన్మానం చేశారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలికి చెందిన విజయ్‌ పాల్‌ సింగ్‌ వయసు 98 ఏళ్లు.. అదృష్టం కొద్ది అయన ఆరోగ్యం కూడా బాగానే ఉంది. తన పనులన్ని తానే చేసుకోగలడు. ఒంట్లో కాస్తా శక్తి ఉండడంతో ఖాళీగా ఉండలేక.. తన ఇంటి సమీపంలో రోడు పక్కన ఓ తోపుడు బండి పెట్టుకున్నాడు. దాని మీద ఉడికించిన శనగలు.. మొలకలు పెట్టుకుని అమ్ముతుంటాడు. నిజానికి ఆయన ఈ వయసులో ఇలా పని చేయడం ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా ఇష్టం లేదు.. కానీ ఖాళీగా కూర్చోవడం తనకు నచ్చదని.. అందుకే పని చేస్తునట్టుగా చెప్పుకొస్తున్నాడు ఈ తాత..


దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్‌ శ్రీవాస్తవ.. విజయ్‌ పాల్‌ సింగ్‌ని తన కార్యాలయానికి ఆహ్వానించి11,000 రూపాయల నగదును అందజేశారు. అంతేకాకుండా శాలువా కప్పి సన్మానం కూడా చేశారు.. వీటితో పాటుగా వాకింగ్ స్టిక్, సర్టిఫికేట్‌ అందజేశారు. ప్రభుత్వ పథకం కింద వృద్ధుడికి ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.


Tags

Read MoreRead Less
Next Story