దేశంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. కిలో రూ.1200..

దేశంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. కిలో రూ.1200..
ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఈ కూరగాయ పేరు కూడా వెరైటీగానే ఉంది.

ఇదేమైనా చికెనా, మటనా అంత రేటు ఉండడానికి అని అనుకుంటారు ఎవరైనా. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఈ కూరగాయ పేరు కూడా వెరైటీగానే ఉంటుంది. పుట్టగొడుగుల మాదిరిగా ఉండే వీటిని 'ఖుక్థి' అని పిలుస్తారు. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ. మార్కెట్లో దీని ధర కిలోకు రూ.1200 పలుకుతుంది. సావన్ నెలలో మాత్రమే లభ్యమయ్యే ఈ కూరగాయ ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్‌ ఈ రెండు రాష్ట్రాలలో మాత్రమే లభ్యమవుతుంది. మార్కెట్లోకి వచ్చిన వెంటనే అమ్ముడు పోతుంది. జార్ఖండ్‌లో దీన్ని రూడా అని అంటారు.

తెచ్చిన రెండు రోజుల్లోనే వండాల్సి ఉంటుంది. లేకపోతే ఇందులోని పోషక విలువలన్నీ నశించిపోతాయి. కూరగాయ కూడా చెడిపోతుంది. బలరాంపూర్, సూరజ్‌పూర్, సుర్గుజా, ఛత్తీస్‌ఘడ్‌తో సహా ఉదయపూర్ పక్కనే ఉన్న కోర్బా జిల్లా అడవుల్లో ఇవి దొరుకుతాయి. రెండు నెలల మాత్రమే దొరికే ఖుక్ధికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అటవీ ప్రాంతంలో నివసించే గ్రామస్తులు వీటిని పండిస్తారు. ఛత్తీస్‌ఘడ్‌లోని అంబికాపూర్‌తో పాటు మధ్య వర్తులు దీన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి కిలోకి రూ1000 నుండి రూ.1200 వరకు విక్రయిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story