ఒంటి కాలుతో 3800 కిలో మీటర్ల సైకిల్ యాత్ర.. అడ్డురాని అంగవైకల్యం..

ఒంటి కాలుతో 3800 కిలో మీటర్ల సైకిల్ యాత్ర.. అడ్డురాని అంగవైకల్యం..
ఆరు నెలల చికిత్స తర్వాత, ఆమె ఆదిత్య మెహతా ఫౌండేషన్‌కు కనెక్ట్ అయ్యింది.

43 రోజుల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 3800 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చేసి చరిత్రను సృష్టించింది తాన్యా. రెండు కాళ్లు ఉన్న వాళ్లు కూడా చేయలేని పని ఒక్క కాలుతో తాన్యా చేసింది. ఆత్మ విశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డు రాదని నిరూపించింది. వైకల్యం శరీరానికే కానీ మనసుకి కాదని చాటి చెప్పింది.

భారతదేశపు ఏకైక మహిళా పారాసైక్లిస్ట్‌గా తాన్య డాగా పేరు నిలిచిపోతుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన తాన్య 2018 లో ఎంబీఏ చదువు కోసం అని డెహ్రాడూన్‌కు వెళ్లింది. అక్కడ కారు ప్రమాదానికి గురై ఒక కాలు కోల్పోయింది. ఆరు నెలల చికిత్స తర్వాత, ఆమె ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ వాళ్లు ఇచ్చే పారా సైక్లింగ్ కోర్సులో జాయిన్ అయింది.

అక్కడ ఉన్నప్పుడే ఇన్ఫినిటీ రైడ్ 2020 కోసం తొమ్మిది మంది పారా అథ్లెట్లు తాన్యతో కలిసి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ కొన వరకు ప్రయాణాన్ని పూర్తి చేసిన ఏకైక మహిళా పారా సైక్లిస్ట్ తాన్య.

యాత్రలో భాగంగా బెంగళూరు చేరుకున్నప్పుడు ఆమెను ఎంతో ప్రోత్సహించిన తండ్రి ఇక లేరన్న వార్త వినాల్సి వచ్చింది. తండ్రి అంత్యక్రియలకు హాజరై, దుఖాన్ని దిగమింగుకుని ఆయన ఆశయం నెరవేర్చడానికి యధావిధిగా తిరిగి పారా-స్పోర్ట్స్‌లో పాల్గొంది. ఆమె సంకల్పం ముందు అంగవైకల్యం తల వంచింది.

సోషల్ మీడియా తాన్యాను సూపర్ వుమన్‌గా కీర్తించింది.

తాన్యా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణాన్ని పూర్తి చేసినందుకు రికార్డు పుస్తకాల్లో తన పేరును నమోదు చేసుకుంది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా పారా సైక్లిస్ట్‌గా అవతరించిన వెంటనే, సోషల్ మీడియా సైట్లు ముఖ్యంగా ట్విట్టర్ అభినందన సందేశాలతో నిండిపోయాయి.

ఒక ట్విట్టర్ యూజర్ ఇలా వ్రాశాడు: "ఆమె సంకల్ప శక్తికి వందనం! మీరు నిజంగా ఒక ప్రేరణ. " అని అన్నారు.

మరో యూజర్ ఇలా వ్రాశాడు: "భారతదేశపు ఏకైక మహిళా పారా సైక్లిస్ట్ తాన్య. జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 2800 కిలోమీటర్ల దూరాన్ని తన సైకిల్‌తో కేవలం 42 రోజుల్లో పూర్తి చేసింది. ఏదైనా చేయాలనే ధైర్యం రాతి కన్నా బలంగా ఉన్నప్పుడు, కష్టాలు కూడా పారిపోతాయి అని అన్నారు. "

Tags

Read MoreRead Less
Next Story