ద్యావుడా.. అలా ఎలా మర్చిపోయాను.. : కోహ్లీ

ద్యావుడా.. అలా ఎలా మర్చిపోయాను.. : కోహ్లీ
తన తప్పును వెంటనే గ్రహించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ

అలవాట్లో పొరపాటు.. ఆ క్షణంలో గుర్తుకు రాలేదు. అయినా వెంటనే తను చేసిన తప్పు తెలుసుకుని ఆగిపోయాడు సారీ అంటూ రెండు చేతులు ఎత్తాడు టీమ్ ఇండియా కెప్టెన్ కోహ్లీ. అసలే కరోనా కాలం.. కఠిన నిబంధనలతో ఐపీఎల్ 2020 సీజన్ నడుస్తోంది. బంతికి ఉమ్ము రాయడం నిషిద్ధం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం ఇక్కడ జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఐసిసి యొక్క కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రాకింగ్ డ్రైవ్‌ను ఆపివేసిన తరువాత బంతిపై ఉమ్ము రాయబోయాడు. తన తప్పును వెంటనే గ్రహించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బంతిని అందుకున్న విరాట్ కోహ్లీ ఉమ్మిని రాయబోయి వెంటనే ఆపేశాడు. కోహ్లీ చర్యను ఫీల్డ్ అంపైర్ గమనిస్తున్నాడు. తను చేస్తున్న తప్పును గ్రహించిన కోహ్లీ వెంటనే అతడికి క్షమాపణలు చెప్పడం కనిపించింది. ఇదే తప్పుని గత వారం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మాన్ రాబిన్ ఉతప్ప కోల్‌కతా నైట్ రైడర్స్ పై ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతిపై ఉమ్ము రాయడం కనిపించింది.

ఊతప్ప క్యాచ్‌ని వదిలేసిన తత్తరపాటులో బంతిపై ఉమ్ము రాస్తూ కనిపించాడు. అయితే ఫీల్డ్ అంపైర్లు అతడు చేసిన తప్పిదాన్ని గుర్తించలేదు. కానీ నెటిజన్లు ఊతప్పని ఉతికి ఆరేశారు. ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాని హోరెత్తించారు. అలవాట్లో పొరపాటుగా ఎవరైనా బంతిపై ఉమ్మురాస్తే వెంటనే టిష్యూతో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మ్యాచ్‌ని కొనసాగించాలి. లక్కీగా కోహ్లీ ఉమ్ము రాయబోతూ ఆఖరి క్షణంలో ఆగిపోయినందున బంతిని శుభ్రం చేయలేదు. ఆటని అలానే కొనసాగించారు. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో బెంగళూరుని ఓడించింది.

Tags

Read MoreRead Less
Next Story