జాతీయం

అద్దెకు మెట్రో రైళ్లు.. అందులోనే బర్త్‌డే పార్టీలు

మెట్రో రైల్లో బర్త్‌డే పార్టీ.. ఆదాయాన్ని పెంచుకోవాలంటే అంతకు మించి మార్గం కనిపించట్లేదు అధికారులకి.

అద్దెకు మెట్రో రైళ్లు.. అందులోనే బర్త్‌డే పార్టీలు
X

ఏం బాస్ .. ఈ సారెక్కడ బర్త్‌డే పార్టీ.. ఏదైనా కొత్తగా ప్లాన్ చేయకూడదు.. అలా ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.. ప్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ, కోలాహలం చేస్తూ కదిలే రైల్లో కేక్ కట్ చేస్తే.. కోక్‌తో ఛీర్స్ చెప్పుకుంటే.. వావ్ ఐడియా అదిరింది గురూ.. అందుకే రాజస్థాన్ జైపూర్ మెట్రో రైల్ కార్పోరేషన్ ఆదాయాన్ని పెంచుకునే మార్గం గురించి ఆలోచిస్తూ ఈ ఐడియా ప్లాన్ చేసింది.

ఎంత చేసినా ఖజానా నిల్ బ్యాలెన్స్ చూపిస్తుంటే ఏదో ఒకటి చేసి ఫుల్ చేయాలని భావించింది. బర్త్‌డే పార్టీ రైల్లో అయితే ఎలా ఉంటుంది.. నాలుగు గంటలు పార్టీ కోసం మెట్రో రైల్‌ని రెంట్‌కి తీసుకుంటే రూ. 5,000లు ఖర్చవుతుంది. ఆపై ఒక్క గంట ఉన్నా అదనంగా రూ.1000లు వసూలు చేస్తారు. నాలుగు కోచ్‌లు కావాలనుకుంటే నాలుగు గంటలకు రూ.20,000లు అవుతుంది.

అలాగే ఈవెంట్‌కి సంబంధించిన ప్రకటనలు, బ్యానర్లు వంటి వాటికి మరికొంత అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుంది అని జైపూర్ మెట్రో రైల్ తెలిపింది. అదనపు ఆదాయం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరింకెందుకు ఆలస్యం ముందుగా బుక్ చేసుకోవాలేమో ఒకసారి కనుక్కుంటే బెటర్.

Next Story

RELATED STORIES