JantarMantar: కవితక్క నిరాహారదీక్ష

JantarMantar: కవితక్క నిరాహారదీక్ష
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత నీరాహార దీక్ష; జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష

మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాల్సిందిగా బీఆరెస్ నేత కల్వకుంట్ల కవిత ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. భరత్ జాగృతి ఎన్జీఓ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన అఖిల పార్టీ నిరసన దీక్షను నిర్వహిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఈ నిరసన దీక్షలో పాల్గొనాల్సిందిగా కవిత కోరిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), శివ్ సేన నుంచి ఉద్ధవ్ ధాక్రే సహా సుమారు పది పార్టీలు కవిత నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ సందర్భంగా నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అప్పీల్ చేస్తామని, పార్లిమెంట్ బయట మద్దతును కూడదీసుకుంటామని తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story