భావోద్వేగాలకు కరిగిపోయి జవాన్లకు లొంగిపోయిన టెర్రరిస్ట్‌..వీడియో వైరల్

భావోద్వేగాలకు కరిగిపోయి జవాన్లకు లొంగిపోయిన టెర్రరిస్ట్‌..వీడియో వైరల్

జహంగీర్‌.. నిన్ను భద్రతా దళాలు చుట్టుముట్టాయి... నీ దగ్గరున్న ఆయుధాన్ని పక్కనపడేసి.. మాకు సరెండర్‌ అయిపో... నీకు ఎలాంటి హాని జరగదు.. మేము గ్యారంటీ ఇస్తున్నామంటూ.. జవాన్లు పిలిచారు.

ఉడుకు రక్తం.. వయసుతో వచ్చిన ఆవేశం. అర్థం లేని ఆకర్షణ.. గమ్యం లేని లక్ష్యం.. ఇవన్నీ జహంగీర్‌ను తీవ్రవాదుల్లో చేరేలా చేశాయి. కానీ తన తప్పును తెలుసుకోవడానికి జహంగీర్‌కు ఎక్కువకాలం పట్టలేదు. తీవ్రవాదులు జరుపుతున్న రక్తపాతంలో ఇమడలేకపోయాడు. వీటన్నింటికి మించి తన కోసం విలపిస్తున్న తండ్రిని చూసి కరిగిపోయాడు. జవాన్లు సొంత సోదరుల్లా పిలుస్తుంటే.. ఏకే-47ను పక్కన పడేసి.. లొంగిపోయాడు..

ఈ భావోద్వేగమైన ఘటన జమ్మూ కాశ్మీర్‌లో జరిగింది. అక్టోబర్ 13న స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌- SPO రెండు AK-47 తుపాకులతో కనిపించకుండా పోయాడు. అదే రోజున చదూర్‌ ప్రాంతంలో జహంగీర్‌ భట్ అనే యువకుడు ఆచూకీ లేకుండా పోయాడు. అప్పటి నుంచి అతడి కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు. నిన్న జరిగిన ఓ ఆపరేషన్‌లో.. ఓ టెర్రరిస్టును భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అతడిని జహంగీర్‌గా గుర్తించారు. అతడి తండ్రిని అక్కడికి పిలిపించారు. లొంగిపోవాలని ఆయనతో నచ్చజెప్పించారు. భయంతో వణుకుతూ పొదల మాటున దాక్కున జహంగీకర్‌.. తండ్రి మాటలు విని కరిగిపోయాడు.. జవాన్లు ఇచ్చిన హామీతో తుపాకి పక్కన పడేసి లొంగిపోయాడు.

జహంగీర్‌కు.. జవాన్లు మనోధైర్యాన్ని నింపారు.. తప్పులు జరుగుతుంటాయి.. నీకేమీ కాదని భరోసా ఇచ్చారు. తన కొడుకును ఉగ్రవాదం ఉచ్చునుంచి కాపాడినందుకు జహంగీర్ తండ్రి.. జవాన్లకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఎమోషన్ వీడియోను ఆర్మీ అధికారులు పోస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story