16 ఏళ్ల వయసులో శారీరక, మానసిక దాడి..: కంగన

16 ఏళ్ల వయసులో శారీరక, మానసిక దాడి..: కంగన
తల్లిదండ్రులు విడిపోతే ఆ ప్రభావం పిల్లలపై చాలా ఉంటుందని,

బాలీవుడ్‌ ఉత్తమ నటుల లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటారు ఆమిర్ ఖాన్. ఆయన నటించే చిత్రాలు సందేశాత్మకంగా ఉంటాయి. పాత్రకు ప్రాణం పెట్టి నటించే ఆమిర్ తానే స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం తారే జమీన్ పర్.. చిన్నారుల మానసిక సమస్యను హృద్యంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. దాదాపుగా అలాంటి మానసిక సమస్యను గత నాలుగేళ్లుగా తాను ఎదుర్కుంటున్నట్లు ఆమిర్ కూతురు ఇరా ఖాన్ ప్రకటించారు.

గత ఏడాది దర్శకత్వ శాఖలోకి అడుగు పెట్టిన ఇరా.. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తనకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసారు. దీనిలో తాను డిప్రెషన్‌లో ఉన్నానని, వైద్యుల సహాయం తీసుకుంటున్నానని వెల్లడించింది. ఈ ప్రకటన ద్వారా మానసిక రుగ్మతలను గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం తన మానసిక పరిస్థితి బాగానే ఉందని అన్నారు. కాగా ఈ విషయమై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు.

16 ఏళ్ల వయసులో తాను కూడా శారీరక, మానసిక దాడికి గురయ్యానని అన్నారు. ఓ వైపు తన సోదరిపై జరిగిన యాసిడ్ దాడి మరోవైపు మీడియా ధాటిని ఎదుర్కోవడం కష్టమైందని గుర్తు చేసుకున్నారు. తాను చేసిన ఒంటరి పోరాటంలో డిప్రెషన్‌కు గురైనట్లు చెప్పారు. తల్లిదండ్రులు విడిపోతే ఆ ప్రభావం పిల్లలపై చాలా ఉంటుందని, ఆ పరిస్థితిని ఎదుర్కోవడం పిల్లలకు కష్టమవుతుందని ఆమె అన్నారు. సంప్రదాయ కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమని కంగన అభిప్రాయపడ్డారు. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా నుంచి విడిపోయి 2005లో నిర్మాత, దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. రీనా, ఆమిర్ కూతురు ఇరా.

Tags

Read MoreRead Less
Next Story