జాతీయం

యూపీలో కొత్తరకం కరోనా కలకలం.. ఒకరు మృతి..!

కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిలో డెల్టా వేరియంట్ దేశాన్ని అతలాకుతలం చేసింది. అక్టోబరులో తొలిసారి గుర్తించిన ఈ వైరస్..

యూపీలో కొత్తరకం కరోనా కలకలం.. ఒకరు మృతి..!
X

కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిలో డెల్టా వేరియంట్ దేశాన్ని అతలాకుతలం చేసింది. అక్టోబరులో తొలిసారి గుర్తించిన ఈ వైరస్.. ఇప్పుడు అనేక దేశాలకు వ్యాప్తించింది. యూకే, అమెరికా లాంటి దేశాల్లో ఈ కేసులు వీపరితంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త రకం వేరియంట్ తాజాగా ఉత్తరప్రదేశ్ లో బయటపడింది. దీనిని కప్పా వేరియంట్‌ గా వైద్యులు గుర్తించారు. కప్పా పాజిటివ్‌ నిర్ణారణ అయిన 66 ఏళ్ల వృద్దుడు మృతి చెందారు. ఇతడిని సంత్‌ కబీర్‌ నగర్‌ జిల్లా నివాసిగా అధికారులు గుర్తించారు. జూన్ 13 న రొటీన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలో భాగంగా సేకరించిన నమూనాలో దీన్ని గుర్తించారు. అనంతరం వీటి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి పంపించారు. వృద్ధుడికి మే 27న కోవిడ్ నిర్ధారణ కాగా.. జూన్ 12 సంత్ కబీర్ నగర్‌లోని బీఆర్డీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చామని మైక్రోబయాలజీ విభాగం హెడ్ డాక్టర్ అమ్రేశ్ సింగ్ తెలిపారు. అంతకుముందు యూపీలో రెండు డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులను గుర్తించగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు.


Next Story

RELATED STORIES