ఆ యువకులను పెళ్లి చేసుకుంటే మూడు లక్షలు.. కర్ణాటక ప్రభుత్వం బంపరాఫర్‌!

ఆ యువకులను పెళ్లి చేసుకుంటే మూడు లక్షలు.. కర్ణాటక ప్రభుత్వం బంపరాఫర్‌!
అంతేకాకుండా ఒక ఎకరాలోపు పొలం ఉన్న వారికి బోరుబావి తవ్వించేందుకు, ట్రాక్టర్ కొనుగోలుకు, పాడి పరిశ్రమకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

కర్ణాటక ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువతులకి బంపరాఫర్‌ ప్రకటించింది. దేవాలయాల్లో అర్చకత్వం చేసే బ్రాహ్మణ యువకుల్ని పెళ్లి చేసుకుంటే రూ.3 లక్షలు ఇస్తామని తెలిపింది. 'మైత్రేయి' పథకం కింద ఈ నగదును అందిస్తామని వెల్లడించింది.ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప 'మైత్రి' పథకాన్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని బ్రాహ్మణ బోర్డు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రెండు పథకాలను ప్రారంభించింది ప్రభుత్వం..

మొదటి పథకం 'అరుంధతి'.. ఈ పథకం కింద బ్రాహ్మణ వధువులకు రూ.25వేలు ఇవ్వగా, రెండవది 'మైత్రేయి' పథకం.. ఈ పథకం కింద ఆలయాల్లో అర్చకులుగా పనిచేసే బ్రాహ్మణ యువకులను యువతులు వివాహం చేసుకుంటే రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించింది.అయితే ముందుగా బాండ్ రూపంలో ఇస్తామని, మూడు సంవత్సరాల తరువాత ఈ బాండ్‌ను నగదు రూపంలో మార్చుకోవచ్చు అని అధికారులు తెలిపారు.

అంతేకాకుండా ఒక ఎకరాలోపు పొలం ఉన్న వారికి బోరుబావి తవ్వించేందుకు, ట్రాక్టర్ కొనుగోలుకు, పాడి పరిశ్రమకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అయితే ఈ పథకాలకు కొన్ని షరతులు ఉంటాయని బోర్డు చైర్మన్ హెచ్‌ఎస్ సచిదానంద మూర్తి తెలిపారు. మైత్రేయి పథకంలో భాగంగా వధువు బ్రాహ్మణ వర్గానికి చెందివారే అయి ఉండాలి. మళ్ళీ అది మొదటి వివాహం అయి ఉండాలని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా అర్చకులు, పురోహితులతో వివాహాలను ప్రోత్సహించేందుకు గానూ యువతులకు ఈ నగదు ప్రోత్సాహం అందజేస్తున్నట్టుగా స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story