Karnataka Night Curfew : కొత్త వైరస్ టెన్షన్ : మొన్న మహారాష్ట్ర.. నేడు కర్ణాటక

Karnataka Night Curfew : కొత్త వైరస్ టెన్షన్ : మొన్న మహారాష్ట్ర.. నేడు కర్ణాటక
కరోనాతోనే ప్రపంచం మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే బ్రిటన్‌లో ఈ మహమ్మారి ఇప్పుడు రూపం మార్చుకుని విజృంభిస్తూ మిగతా దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.

కరోనాతోనే ప్రపంచం మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే బ్రిటన్‌లో ఈ మహమ్మారి ఇప్పుడు రూపం మార్చుకుని విజృంభిస్తూ మిగతా దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.ఈ నేపధ్యంలో అలెర్ట్ అయిన కొన్ని దేశాలు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే భారత్ ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై డిసెంబరు 31 వరకు నిషేధం విధించింది.

అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ (Karnataka Night Curfew ) విధించగా, తాజాగా కర్ణాటక ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి జనవరి 02 వరకు రాత్రి కర్ఫ్యూ ను విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 06 గంటల వరకు ఈ కర్ఫ్యూ ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ సమయంలో ఎవరూ బయట తిరగకూడదని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని వెల్లడించింది. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక విదేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. డిసెంబర్ 7 నుంచి రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను అందజేయాలని బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలను కోరింది. ఇక బ్రిటన్‌ నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలనీ సూచించింది. అటు క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకలపైన కూడా కర్నాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

Tags

Read MoreRead Less
Next Story