వ్యవసాయ బిల్లులు వ్యతిరేకించండి: కేజ్రీవాల్

వ్యవసాయరంగానికి చెందిన మూడు బిల్లులను రాజ్యసభలో వ్యతిరేకించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ఎంపీలకు పిలుపు

వ్యవసాయ బిల్లులు వ్యతిరేకించండి: కేజ్రీవాల్
X

వ్యవసాయరంగానికి చెందిన మూడు బిల్లులను రాజ్యసభలో వ్యతిరేకించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ఎంపీలకు పిలుపు నిచ్చారు. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో బీజేపీయేతర పార్టీలు అన్ని ఈ బిల్లును వ్యతిరేకించాలని సూచించారు. ఈ బిల్లులకు ఆమోదం లభిస్తే.. కార్పోరేట్ కంపెనీల చేతుల్లో రైతులు మోసపోతారని అన్నారు. ఇవి రైతు వ్యతిరేక బిల్లులని.. వీటిపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన తెలుపుతున్నారని అన్నారు. ఎవరూ హౌస్ నుంచి వాకౌట్లు చేయొద్దని.. బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలిన కోరారు. తమ పార్టీ మాత్రం ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తుందని అన్నారు.

Next Story

RELATED STORIES