జాతీయం

Veena George : కేకే శైలజ స్థానంలో వీణ జార్జ్?

Veena George : మే 20న కేరళలో కొత్తగా కొలువుదీరే కేరళ కేబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా కొత్త ముఖం తెరపైకి వచ్చింది.

Veena George : కేకే  శైలజ స్థానంలో వీణ జార్జ్?
X

Veena George : మే 20న కేరళలో కొత్తగా కొలువుదీరే కేరళ కేబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా కొత్త ముఖం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే వీణ జార్జ్.. కేకే శైలజ స్థానాన్ని భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే చరిత్రలో తొలిసారిగా ఓ రాజకీయ నాయకురాలుగా మారిన జర్నలిస్టు కేరళలో మంత్రిగా అవుతారు. కాగా వీణ జార్జ్ .. పలు మలయాళ ఛానెళ్లలో జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ గా పనిచేశారు. 2016 ఎన్నికల్లో పతనంతిట్ట జిల్లాలోని అరన్ముల అసెంబ్లీ నుంచి గెలుపొందారు. ఈ ఏడాది రెండోసారి మళ్లీ ఎన్నికయ్యారు. మరోవైపు ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజను పార్టీ విప్ గా నియమించనున్నారు. అటు మే 2న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎల్డీఎఫ్ 140 స్థానాలకి గాను 99 స్థానాలను గెలుచుకుంది.

Next Story

RELATED STORIES