18 ఏళ్లకే పెళ్లైంది.. భర్త వదిలేశాడు.. ఫైనల్ గా పోలీస్ ఆఫీసర్‌గా..

18 ఏళ్లకే పెళ్లైంది.. భర్త వదిలేశాడు.. ఫైనల్ గా పోలీస్ ఆఫీసర్‌గా..
శివ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. 18 ఏళ్ళ వయసుకే పెళ్లై ఒక బిడ్డకూడా పుట్టింది. ప్రేమగా చూసుకుంటాడనుకున్న భర్త ఏమాత్రం కనికరం లేకుండా భార్యని, బిడ్డని వదిలేశాడు.

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అనుకున్నవి కొన్ని అనుకోనివి కొన్ని జరుగుతుంటాయి. పరిస్థితులకు తలవంచి ముందుకు వెళ్లాలి.. ఎప్పుడో ఒకప్పుడు మనం ఎదురు చూడని అవకాశం తలుపు తడుతుంది. కాస్త ఓపిగ్గా ఎదురు చూసే సహనం కావాలి.

ఆమె ఒకప్పుడు అక్కడ నిమ్మరసం, ఐస్ క్రీములు అమ్ముతూ జీవనం సాగించింది. ఇప్పుడు అదే ఏరియాలో పోలీస్ ఆఫీసర్‌గా డ్యూటీ చేస్తోంది. కేరళకు చెందిన 31 ఏళ్ల అనీ శివ ఇటీవల వర్కాలా పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. 13 సంవత్సరాల క్రితం, ఆమె అదే ప్రాంతంలో నిమ్మరసం, ఐస్ క్రీం అమ్ముతూ జీవనం సాగించింది.

శివ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. 18 ఏళ్ళ వయసుకే పెళ్లై ఒక బిడ్డకూడా పుట్టింది. ప్రేమగా చూసుకుంటాడనుకున్న భర్త ఏమాత్రం కనికరం లేకుండా భార్యని, బిడ్డని వదిలేశాడు.

అని శివ కంజీరాంకుళంలోని కెఎన్ఎమ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సవంత్సరం చదువుతోంది. అక్కడే పరిచయం అయిన తన సహచర విద్యార్థిని కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ఆమె బిడ్డను ప్రసవించిన తర్వాత భర్త ఆమెను విడిచిపెట్టాడు. అప్పటినుండి ఆమె ఒంటరిగా ఉంది. ఆమె ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నించింది, కానీ ఆమె కుటుంబం ఆమెను తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అంగీకరించలేదు. ఆమె తన కొడుకు శివసూర్యతో కలిసి అమ్మమ్మ ఇంట్లో షెడ్‌లో నివసించడం ప్రారంభించింది.

"ఆమె మొదట తాను సొంతగా తయారు చేసిన కరివేపాకు పొడి, సబ్బులు అమ్మడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు ఇన్సూరెన్స్ ఏజెంట్‌గానూ పని చేసింది. మోటారుసైకిల్‌పై ప్రయాణించి ఇళ్లలో ప్రజలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేసేది. ఆ విధంగా సంపాదించిన కొద్ది మొత్తం డబ్బుతోనే సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

హస్తకళా ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా తనకూ, తన బిడ్డకూ బ్రతకడానికి డబ్బు సమకూర్చుకునేది. కానీ అది కూడా ఎంతో కాలం సాగలేదు. అదే సమయంలో ఆమెకి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆమె జీవితాన్ని, ఆమె కలను తెలుసుకుని సబ్-ఇన్స్పెక్టర్ పరీక్షలకు హాజరుకావాలని సూచించాడు. ఆమెకు ఆర్థికంగా సహాయం చేసి చదువకోవడానికి, పరీక్షలకు హాజరవడానికి సహకరించాడు. మంచి మనసుతో అతడు చేసిన సాయం ఊరికే పోలేదు.

కొద్ది రోజుల క్రితమే వర్కల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా శివకు పోస్టింగ్ వచ్చింది. ఇక్కడే నా చిన్న పిల్లవాడితో నేను కన్నీళ్లు పెట్టుకున్న ప్రదేశం, నేను నిమ్మరసం అమ్మిన ప్రదేశం అని పోలీస్ యూనిఫాంలో ఆ ప్రదేశాన్ని సందర్శించి తన కలను నిజం చేసిన వ్యక్తికి మనసులోనే ధన్యవాదాలు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story