లెప్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్‌ బేడీ తొలగింపు..తమిళిసైకి బాధ్యతలు

లెప్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్‌ బేడీ తొలగింపు..తమిళిసైకి బాధ్యతలు
లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి కిరణ్‌ బేడీని తొలగించి ఆ స్థానంలో తమిళిసైకి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశం అవుతోంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుదుచ్చేరిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కిరణ్‌ బేడీని రాష్ట్రపతి తొలగించారు. దీనికి సంబంధించిన ప్రకటన రాష్ట్రపతి కార్యాలయం నుంచి వెలువడింది.ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌ కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. పార్టీ బలం తగ్గిపోవడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి కిరణ్‌ బేడీని తొలగించి ఆ స్థానంలో తమిళిసైకి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశం అవుతోంది.

ఉత్తర్వులు అందగానే పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను తమిళసై స్వీకరించారు. మరికొద్దిరోజుల్లో నాలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్పుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story