Kolkata: కోల్ కతా వైబ్స్; యెల్లో టాక్సీలు కనుమరుగు!

Kolkata: కోల్ కతా వైబ్స్; యెల్లో టాక్సీలు కనుమరుగు!
బెంగాల్ వీధుల్లో క్రమంగా కనుమరుగు అవ్వనున్న యెల్లో టాక్సీలు; గడువు తీరుతుండటంతో స్క్రాప్ లోకి వెళ్లనున్న కార్లు

Kolkata: కోల్ కతా వైబ్స్; యెల్లో టాక్సీలు కనుమరుగు!


కోల్ కతా నగరిలోకి అడుగుపెడుతూనే ఓ గమ్మత్తైన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుంది అంటారు అక్కడి వెళ్లి వచ్చిన వారు. ఓ వైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచుకున్న నగరం ఉరుకులు పరుగుల పెడుతుంటే.. మరోవైపు మన చరిత్రకు, ఇతిహాసానికి సాక్ష్యాలుగా నిలిచిన కట్టడాలు, దశాబ్దాల చరిత్ర గల ట్రామ్ లు, నోస్టాల్జియాకు గురిచేసే హస్తకళలు మనసును హత్తుకుంటూ గడచిన కాలాన్ని గుర్తుచేస్తుంటాయి.


ఇక ఈ జాబితాలోనే చేరుతుంది యెల్లో టాక్సీ. అవును మరి, కోల్ కతాలో అడుగుపెట్టాగానే పలుకరించే టాక్సీ వాలాలు చాలామందే ఉంటారు. కానీ, ఈ యెల్లో అంబాసిడర్ టాక్సీలో వీధుల్లో చక్కర్లు కొట్టడం ఓ చక్కని అనుభూతి. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ నగరంలోని రోడ్లపై తిరిగే పసుపు పచ్చని టాక్సీలు పట్టణానికి ఓ చక్కని వైబ్ తీసుకువస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మరో మూడేళ్లలో ఈ యెల్లో టాక్సీలు కనుమరుగు అవ్వబోతున్నాయట.


అవును 2029 నాటికి యెల్లో అంబాసిడర్ టాక్సీలన్నీ 15ఏళ్ల గడువు పూర్తి చేసుకోబోతున్నాయి. అనంతరం వీటన్నింటినీ స్క్రాప్ లోకి పంపించాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో మూడేళ్లలో ఆ గడువు ముగియనుండటంతో ఇప్పుడు డ్రైవర్లు అందరూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.


1858లో బ్రిటీష్ మోరిస్ ఆక్స్ ఫర్డ్ ఈ యెల్లో అంబాసడర్ కు ప్రాణం పోశారు. అనంతరం 2014లో హిందుస్థాన్ మోటర్స్ యాజమాన్యం భారీ నష్టాలతో సంస్థను మూసివేసింది. అయితే దీన్ని బట్టీ ప్రస్తుతం కోల్ కతా వీధుల్లో తిరుగుతున్న యెల్లో టాక్సీలు మరో మూడేళ్లలో కనుమరుగు అవుతాయని స్పష్టమవుతోంది.

Tags

  • 1
  • 2

  • Read MoreRead Less
    Next Story