నిమ్మరసం, ఉప్పు, మిరియాలతో ఈ సమస్యలకు చెక్..

నిమ్మరసం, ఉప్పు, మిరియాలతో ఈ సమస్యలకు చెక్..
నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాలు కలిపి ఈ మిశ్రమాన్ని

1. గొంతు నొప్పి

1 గ్లాసు గోరు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక టీస్పూన్ ఉప్పు వేసి కలిపి బాగా పుక్కిలించాలి. గొంతు నొప్పికి ఇది అద్బుత నివారిణిగా పని చేస్తుంది.


2. గాల్‌బ్లాడర్ స్టోన్స్

మీ గాల్‌బ్లాడర్ స్టోన్స్ (పిత్తాశయం)లో ఉండే జీర్ణ రసాల గట్టిపడిన నిక్షేపాలను పిత్తాశయ రాళ్ళు అంటారు. ఈ పిత్తాశయ రాళ్ళు బాధాకరంగా ఉంటాయి. మీ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. 3 స్పూన్ల ఆలివ్ నూనె 1 స్పూన్ నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాలు కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇది పిత్తాశయ రాళ్ళు కదలడానికి కారణమవుతుంది.

3. నోటిలో పుండ్లు

నోటి పూత అనారోగ్య హేతువు. దీన్ని నయం చేయడానికి ఒక టేబుల్ స్పూన్ హిమాలయ ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. ఈ నీటితో రోజుకు మూడు సార్లు నోరు శుభ్రం చేసుకుంటే అల్సర్ బాధించదు.

4. బరువు తగ్గడం

బరువు తగ్గాలనుకునే వారికి బ్రహ్మాండంగా పనిచేసే పానీయం. 1/4 టీస్పూన్ నల్ల మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక గ్లాసు నీటిలో. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దీన్నితీసుకుంటే వేగంగా బరువు కోల్పోతారు!

5. వికారం

కడుపులో వికారాన్ని నల్ల మిరియాలు తొలగిస్తాయి. నిమ్మకూడా వికారం తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందువల్ల, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ మిరియాల పొడి ఒక పెద్ద గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి నెమ్మదిగా త్రాగాలి.

6. జలుబు మరియు ఫ్లూ

జలుబు లేదా ఫ్లూ కోసం నిమ్మకాయ అద్భుతంగా పని చేస్తుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం చెక్క నిమ్మరసం పిండి కొద్ది సేపు ఉంచాలి. ఆ తరువాత దీన్ని తాగాలి.

Tags

Read MoreRead Less
Next Story